Breaking News

రెండు అరటి పండ్ల ధర రూ. 442 చూసి షాక్ అయినా హీరో….

verry high price on two bananas

రెండు అరటి పండ్ల ధర చూసి షాక్ అయ్యారు… ప్రముఖ నటుడు ‘దిల్ దడక్‌నే దో’ ఫేమ్ రాహుల్‌ బోస్‌….తన ఆవేదనను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ … ” పండ్లు ఆరోగ్యానికి హానికరం కాదు అని ఎవరు చెప్పారు..” టాగ్ లైన్ అందరిని ఆకట్టుకుంటుంది …

(Rahul bose: You have to see this to believe it. Who said fruit wasn’t harmful to your existence? )
ఇక వివరాల్లోకి వెళ్తే …
ఒక డజను అరటి పండ్లు రేటు ఎంత? సుమారు 45 నుంచి 60 ఉంటుంది. దీని లెక్కన ఒక్క అరటి పండు రేటు రూ.5 నుంచి 6 ఉండాలి. కానీ చండీగఢ్‌లోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్లో మాత్రం రెండు అరటి పండ్ల ధర రూ.442.50. అవును మీరు చదివింది నిజం.
ప్రముఖ నటుడు రాహుల్‌ బోస్‌ చండీగఢ్‌లోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్లో బస చేశారు. ఉదయం లేచి… జిమ్‌కి వెళ్లే ముందు రెండు అరటి పండ్లు ఆ హోటల్ లో ఆర్డర్‌ చేశాడు. తిరుగోచి చూసే సరికే టేబుల్‌పై రెండు అరటి పండ్లు ఉన్నాయి. వాటి పక్కనే బిల్ వుంది …అది చేసే సరికి
మన హీరో కి షాక్ తగిలింది ….రెండు అరటి పండ్ల ధర రూ.442.50. దీనికి GST కూడా ఆడ్ చేసారు …..తనకు జరిగిన ఈ సన్నివేశాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసి అభిమానులతో షేర్ చేసుకున్నారు ….ఇందులో నచ్చిన విషయం ఏంటంటే అతను రాసిన tagline ” పండ్లు ఆరోగ్యానికి హానికరం కాదు అని ఎవరు చెప్పారు “…..ఇప్పుడు ఇది సోషల్ మీడియా లో వైరల్ గా
మారింది……

Related posts