పుల్వామా దాడికి ప్రతీకారకంగా పాక్ ఉగ్రవాద శిబిరాలపై భారత్ మెరుపు దాడి……

Pulwama revenge: Mirage jets destroy Pakistan terror camp with 1,000 kg bombs in pre-dawn strike to destroy JeM camps

 

New Delhi: పుల్వామా దాడికి సమాదనంగా మన భారత విమానిక దళం చేసిన ఆకస్మిక దాడుల్లో సుమారు 200 నుంచి 300 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల స్థలాలనే లక్ష్యంగా భారత వాయు విమాన సేన మంగళవారం ఉదయం తెల్లవారుజామున సుమారు వెయ్యి కిలోల పేలుడు పదార్థాలతో పాక్ ఫై విరుచుకు పడింది  భారత్ . 12 మిరాజ్‌-200 జైట్‌ ఫైటర్స్‌తో చేపట్టిన సర్జికల్‌ స్ట్రైక్‌-2 భారత విమాన సేన విజయవంతంగా పూర్తి చేసేసింది. ఈ దాడులను గురించి ధృవీకరించిన పాక్‌.. తమ బలగాలు తిప్పికొట్టాయని చెబుతూనే.. ఉగ్రవాదులను తమ సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తోంది. భారత విమాన సేన దాడులపై ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసర సమావేశం ఏర్పాటుచేస్తున్నారు . ఆర్థిక, రక్షణ శాఖతో ఆయన ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. జరిగిన వాయుసేన దాడుల గురించి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ప్రధాని మోడీకి వివరించారు. భారత సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్‌ ప్రకటించింది.

pulwana revange telugu news king

ఈ దాడుల కారణంగా భారత్‌, పాక్‌ సరిహద్దులో తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత విమానిక మెరుపు దాడులపై మన యావత్ భారత్‌ హర్షం వ్యక్తం చేస్తోంది. సర్జికల్‌ స్ట్రైక్‌-2తో భారత విమాన సేన …. పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్లకు మనస్ఫూర్తిగా ఘన నివాళులర్పించింది మన యావత్ భారత్. కాంగ్రెస్‌ పార్టీ అధినేత రాహుల్‌ గాంధీ భారత విమానిక దళానికి సెల్యూట్‌ అంటూ ట్వీట్‌ చేశారు. ఇది మన దేశం గర్వించ దగ్గ విషయం అని అయన అభిప్రాయపడ్డారు.

Related posts