ప్రముఖ సినీ దర్శకుడు కోడి రామకృష్ణ గారు ఇక లేరు…

కోడి రామకృష్ణ మృతి:

kodi ramakrishna death
తెలుగు సినిమా  చిత్రా దర్శకుడు కోడి రామకృష్ణ ఈరోజు కన్ను మూశారు . గురువారం తీవ్ర అస్వస్థతకు గురైన కోడి రామకృష్ణను కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్  గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అ తరువాత  ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించి  ఈరోజు  తుదిశ్వాస విడిచారు. గత కొద్దీ రోజులుగా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో రామకృష్ణ బాధపడుతున్నారు. కొన్నేళ్ల క్రితం కోడి రామకృష్ణ  అనుకోకుండా  పక్షవాతానికి గురయ్యారు. ఆ సమయంలో సరైన చికిత్స వలన వెంట‌నే కోలుకున్నారు.
kodi ramakrishna dead
 కోడి రామకృష్ణ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు తెలుగు లోనే కాకుండా  తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చిత్రీకరించారు . 90ల‌లో ఎన్నో విజయాత్మక  చిత్రాలు తెర‌కెక్కించిన కోడి రామ‌కృష్ణ తెలుగులో అ రోజ్జులో మన అందరి హీరోస్ తో  సినిమాలు చేశారు. కోడి రామకృష్ణ కుటుంబ కథా చిత్రాలు తెరకెక్కిస్తూనే  తనకి  ఇష్టమైన జోనర్ ఫాంటసీ చిత్రాలను  ‘అమ్మోరు’, ‘దేవి’, ‘దేవీపుత్రుడు’, ‘అంజి’, ‘అరుంధతి’ వంటి  చిత్రాలను రామకృష్ణ తెలుగు ప్రేక్షకులకు అందించారు. తెలుగు సినిమా దర్శకుడిగా  1982లో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. తొలి చిత్రంగా  చిరంజీవితో ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ తెరకెక్కించారు. అప్పటి నుంచి మొదలుకొని 2016 వరకు సినిమాలు చేస్తూనే వచ్చారు. చివ‌రి సారిగా  క‌న్నడ భాష‌లో ‘నాగరహవు’ (తెలుగులో నాగభరణం) అనే చిత్రాన్ని తీసారు.
arundathi telugu news kingammoru devi putrudu telugu news king
కోడి రామకృష్ణ నందమూరి బాలకృష్ణతో  చాలా చిత్రాలు  తెరకెక్కించారు. వీటిలో  చాలా సినిమాలు సూపర్ హిట్లు. ‘మంగమ్మగారి మనవడు’తో ప్రారంభమైన వీరిద్దరి కాంబినేషన్‌లో ఆ తరవాత ‘ముద్దుల క్రిష్ణయ్య, మువ్వ గోపాలుడు, భారతంలో బాలచంద్రుడు, ముద్దుల మావయ్య, బాల గోపాలుడు, ముద్దుల మేనల్లుడు’ వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. కోడి రామకృష్ణ అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, రాశేఖర్, వినోద్ కుమార్, రాజేంద్ర ప్రసాద్, జగపతిబాబులతో సినిమాలకి పనిచేశారు. లేడీ సూపర్ విజయశాంతి  తో  సైతం ఈయన మంచి చిత్రాలు తెరకెక్కించారు. ఇలాంటి గొప్ప దర్శకుణ్ణి తెలుగు  సినిమా కోల్పోవడం చాలా బాధాకరం. కోడి రామకృష్ణ గారి ఆత్మ శాంతి కోసం తెలుగున్యూస్ కింగ్ నివాళులు అర్పిస్తోంది.

 ఆవేదనకు లోనైన పవన్ కల్యాణ్

Telugu Fim Celebraties Responding  on Veteran Telugu filmmaker Kodi Ramakrishna death

Related posts