అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడానికి గల ముఖ్య కారణం…

International Women’s day Reason or History and Best Telugu Wishes Quotes…

 

 

March 8th అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడానికి గల ముఖ్య కారణం…

మొట్టమొదటి మహిళా దినోత్సవం 1909 సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన న్యూయార్క్ నగరంలో జరిగింది. అపుడు దీనిని నేషనల్ ఉమెన్స్ డే గా వ్యవహరించారు. ఆగస్టు 1910 సంవత్సరం డెన్మార్క్ లో జరిగిన ఇంటర్నేషనల్ ఉమెన్స్ కాన్ఫరెన్స్ లో మార్చి 8వ తేదీనమహిళా దినోత్సవం జరుపుకోవాలని అందరూ కలిసి ప్రతిపాదించారు దీన్ని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే జరపాలని అనుకున్నారు కానీ అప్పుడు దీన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.

1914వ సంవత్సరం మార్చి 8వ తేదీ ఆదివారం కావడంతో అమెరికన్ మహిళలు మరల ఆ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. 1913 వ సంవత్సరం నుండి రష్యా మహిళలు ఫిబ్రవరి నెల చివరి శనివారం ఈ మహిళా దినోత్సవంగా జరుపుకునే వారు. 1917 సంవత్సరం మార్చి 8వ తేదీన సోవియట్ రష్యా లోని మహిళలు మొట్టమొదటిసారిగా ఓటు హక్కులు పొందారు. ఓటు హక్కు పొందిన ఈ రోజునే మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని అక్కడి మహిళలు భావించారు, అప్పటి నుండి మార్చి 8వ తేదీ ని సోవియట్ రష్యా ప్రభుత్వం నేషనల్ హాలిడేగా ప్రకటించింది సోవియట్ రష్యా తో పాటుగా మరికొన్ని సోషలిస్టు మరియు కమ్యూనిస్టు దేశాలు మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం మొదలుపెట్టాయి.

1975వ సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి మార్చి 8 వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా అధికారికంగా గుర్తించింది. ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవం వెనకాల వున్నా రహస్యం ….

International Womens day quotes in Telugu

worlds womens day telugu quotes

womens day telugu quotes in telugu news king

Related posts